FbTelugu

బాబు కోసమే జగన్ మోదీ భజన: జెఎంఎం

అమరావతి: ఎపి సిఎం జగన్‌ మోహన్ రెడ్డికి ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా (జెఎంఎం) గట్టి కౌంటర్‌ ఇచ్చింది. టిడిపి అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు కు వ్యతిరేకంగా జగన్‌ కేంద్రంతో స్నేహం చేస్తున్నారని జేఎంఎం ఆరోపించింది.

ఏపి కి మోదీ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు అందుతోందని, కేంద్రం వైఖరితో బిజెపియేతర రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని విమర్శించింది. జగన్‌ కంటే ఝార్ఖండ్‌ సిఎం హేమంత్ సోరెన్ ఎంతో పరిణితి కలవారని జెఎంఎం కార్యదర్శి ట్వీట్ చేశారు. శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ, వీడియో కాన్ఫరెన్స్ లో సీఎంల మాట వినడం లేదని ఝార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ పై సిఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు వద్దు.. ప్రధానికి మద్దతుగా ఉందామని జగన్ రీట్వీట్‌ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.