FbTelugu

జియో లాపీలు వచ్చేస్తున్నాయి…

ముంబయి: టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో మొబైల్ కంపెనీ తక్కువ ధరకు ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది. త్వరలో 5 జీ మొబైల్స్ ను కూడా రిలీజు చేయనున్నది.

జియో బుక్ పేరిట తీసుకువస్తున్న ల్యాప్ టాప్ లు మే నాటికి మార్కెట్ లోకి రావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇవి జియో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద పనిచేయనున్నాయి. ఫోర్ జీ టెక్నాలజీకి సపోర్టు చేసే విధంగా వీటిని తయారుచేస్తున్నారు. ఇందుకోసం క్వాల్ కామ్ కంపెనీతో పాటు చైనా తయారీదారు బ్లూ బ్యాంక్ కమ్యూనికేషన్ తో అగ్రిమెంట్ చేసుకున్నది. ఇదే కంపెనీలో 5జీ ఫోన్లను కూడా తయారు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.