FbTelugu

జియో డేటా దాటితే అంతే…

ముంబై: కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన జియో ఫైబర్ నెట్ సేవలపై అందరూ మక్కువ చూపుతున్నారు. ఇప్పుడున్న సర్వీసు నుంచి జియో ఫైబర్ కు మారుతున్నారు.

అయితే ప్రారంభ ప్లాన్ లో మాత్రం ఆశించిన విధంగా స్పీడ్ ఉండదనే వార్తలొస్తున్నాయి. నెలకు రూ.399 తో ప్రారంభ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్ కింద అందరికి అపరిమిత నెట్ లభిస్తుందని ప్రచారం చేస్తున్నారు. యూసేజి విధానం ప్రకారం 3.3 టీబీ డేటా వాడకం పూర్తయితే వేగం తగ్గిపోతుంది.

3.3 టీబీ డేటా అయిన తరువాతం స్పీడ్ 1ఎంబీపీఎస్ కు పడిపోతుంది. పోటీదారు అయిన టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ మాత్రం వినియోగదారులకు ఫెయిర్ యూసేజీ పాలసీ దాటిన తరువాత 3ఎంబీపీఎస్ వేగంతో నెట్ అందిస్తోంది.

You might also like