FbTelugu

ఆరు నెలల్లో జీయో 5జీ షురూ…

ముంబై: దేశంలో ఐదో తరం మొబైల్ సేవలను వచ్చే ఏడాది జూన్ నాటికి ప్రారంభించాలనే నిర్ణయానికి రిలయన్స్ జియో వచ్చింది. ఇండియ మొబైల్ కాంగ్రెస్ లో కంపెనీ అధినేత ముఖేశ్ అంబానీ ఈ విషయాన్ని వెల్లడించారు.
దేశంలో 5జీ నెట్ వర్క్ ను ప్రారంభించేందుకే కేంద్ర ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం త్వరగా తీసుకోవాలని అంబానీ కోరారు. పూర్తి దేశీయ సాంకేతికతతో 5జీని అభివృద్ధి చేశామని, దీనికి సంబంధించిన హార్డ్ వేర్, టెక్నాలజీ మొత్తం దేశంలో సిద్ధం కానున్నాయని ఆయన వివరించారు.

దేశంలో డిజిటల్ ఎకానమీ పెరిగిందని, హార్డ్ వేర్ విక్రయాలు కూడా ఊపందుకున్నాయని ముఖేశ్ అంబానీ వెల్లడించారు. భారత్ చిప్ డిజైన్ లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను అందుకొందన్నారు. స్వదేశీ సాంకేతికతతో సెమి కండక్టర్ పరిశ్రమకు కేంద్రంగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు. సాఫ్ట్ వేర్ రంగంలో సాధించిన విజయాలే హార్డ్ వేర్ రంగంలో కూడా పునరావృతం చేయవచ్చని ముఖేశ్ అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.