FbTelugu

జూలై 20 జెఫ్ బెజోస్ తొలి అంతరిక్షయానం షురూ…

న్యూయార్క్: అమెజాన్ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ సిఈఒ జెఫ్ బెజోస్ తన సోదరుడితో కలిసి అంతరిక్షయానం చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఐదేళ్ల వయస్సు ఉన్నప్పుడే అంతరిక్షంలోకి వెళ్లాలని కలలు కన్నట్లు ఆయన వివరించాడు.

ఈ ఏడాది జూలై 20వ తేదీన తన సోదరుడు మార్క్ తో కలిసి అంతరిక్ష ప్రయాణం చేయబోతున్నట్లు బెజోస్ సంతోషంతో చెప్పాడు. అంతరిక్ష అందాలను చూపించేందుకు ఎగరనున్న తొలి ప్యాసెంజర్ విమానం బ్లూ ఒరిజన్ ద్వారా అక్కడ షికార్లు కొట్టనున్నారు. మళ్లీ మళ్లీ ఉపయోగించగల సామర్థ్యం ఉన్న ఈ సబ్ ఆర్బిటల్ రాకెట్ సిస్టమ్ న్యూ షెఫర్డ్. ఇదే రాకెట్ లో బెజోస్ తన సోదరుడు మార్క్ సహా వ్యోమగాములతో ఎగరనున్నది. ఆన్ లైన్ లో వేలం వేసిన సీటును దక్కించుకున్న వ్యక్తి కూడా ఇందులో ప్రయాణించనున్నాడు. ఒక్క సీటు కోసం వేలం వేయగా దాదాపు రూ.20.96 కోట్లు చెల్లించేందుకు ఒక వ్యక్తి ముందుకు వచ్చి తీసుకున్నాడు. అంతరిక్షయానం కోసం బెజోస్ 2000 సంవత్సరంలో దీనిని స్థాపించాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.