FbTelugu

అరవింద్ విమర్శలు వెనక్కి తీసుకోవాలి…

హైదరాబాద్: ఎంపీ అరవింద్ రైతులను మోసం చేసాడని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ .జీవన్ రెడ్డి ఆరోపించారు.

గన్ పార్కు వద్ద మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడారు. కేటీఆర్ నుద్దేశించి అరవింద్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేటీఆర్ మాట్లాడినందుకు కేటీఆర్ ను దూషిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వంలో అన్నీ అమ్మేస్తున్నారు. తండ్రికి గౌరవం ఇవ్వలేని సంస్కార హీనుడు అరవింద్ అని అన్నారు. నిజామాబాద్ ప్రజలు అరవింద్ ను తరిమికొడతారు. తెలంగాణ కోసం జన్మించిన కుటుంబం కేసీఆర్ అని, కేసీఆర్ కుటుంబాన్ని తిట్టినవారి గతి ఏమైందో ఆలోచించాలి అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.