FbTelugu

జెఈఈ మెయిన్స్-2021 పరీక్షలు వాయిదా

న్యూఢిల్లీ: జేఈఈ మెయిన్స్-2021 పరీక్షలు వాయిదా  వేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ తెలిపారు. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఈ నెల 27, 28, 30న జరగాల్సి ఉన్న జేఈఈ మెయిన్స్ ను వాయిదా వారు.

తదుపరి పరీక్ష తేదీలు 15 రోజులు ముందు విద్యార్థులకు తెలియచేస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి, మార్చిలో ఇప్పటికే రెండు సెషన్లు పూర్తయ్యాయి. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి రమేష్ వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వినతి మేరకు వాయిదా వేశామన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.