FbTelugu

జెఈఈ ప్రవేశ పరీక్ష మళ్లీ వాయిదా

న్యూఢిల్లీ: దేశంలో ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశం కోసం నిర్వహించే జెఈఈ అడ్వాన్స్ డు పరీక్షలు మరోసారి వాయిదా వేయలేక తప్పలేదు. ఈ మేరకు ఖరగ్ పూర్ ఐఐటి అధికారికంగా ప్రకటించింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జూలై 3వ తేదీన నిర్వహించాల్సిన జెఈఈ అడ్వన్స్ డు పరీక్ష ను సెకండ్ వేవ్ కారణంగా నిర్వహించలేకపోతున్నట్లు తెలిపింది. కరోనా వైరస్ అదుపులోకి వచ్చిన తరువాత పరీక్ష ఎప్పుడు నిర్వహించేది సమాచారం ఇస్తామని తెలిపింది. కరోనా కారణంగా అడ్వాన్స్ డు పరీక్షను వాయిదా వేస్తూ గత నెలలో ప్రకటన చేశారు. తాజాగా ఇవాళ మరోసారి ప్రకటించి వాయిదా వేశారు.

ఇక ఏప్రిల్ లో జరగాల్సిన జెఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా వాయిదా వేసిన విషయం తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ మూలంగా మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.