FbTelugu

జూలై 3న జేఈఈ ప్రవేశ పరీక్ష

న్యూఢిల్లీ: ఐఐటీల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్ డు పరీక్ష 2021 తేదీని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ప్రకటించారు. వచ్చే ఏడాది జూలై 3వ తేదీన పరీక్ష నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు.

విద్యార్థుల నుంచి వినతులను పరిగణనలోకి తీసుకుని ఓసీ విద్యార్థలకు 75 శాతం మార్కులు తప్పనిసరి నిబంధన తొలగిస్తున్నట్లు మంత్రి రమేష్ తెలిపారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో 2020లో కూడా ఈ నిబంధనలను సడలించామని మంత్రి వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.