FbTelugu

జేసీ ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేయాలి

గళమెత్తిన ముస్లిం సంఘాలు, మహిళలు
నెల్లూరు: జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి బంగ్లాలో వేధింపులకు గురైన అంగన్ వాడీ హెల్పర్ రెహనా బేగం కు మద్దతుగా కోటమిట్టలో బాధితురాలు, ముస్లిం సంఘాలు ఆందోళన నిర్వహించారు.

తక్షణమే జేసీ ప్రభాకర్ రెడ్డి ని సస్పెండ్ చేయాలని, వేధింపులకు పాల్పడిన జేసీ భార్యపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం చేయాలని ముస్లిం సంఘాల నేతలు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితురాలికి అండగా ఉంటా..న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీ ఇచ్చారు. జేసీ ఇంట్లో పని చేయించడానికి అంగన్ వాడీ హెల్పర్ ను నియమించలేదని, పేద పిల్లలకు చదువులు చెప్పించేందుకు ప్రభుత్వం నియమించిందన్నారు.

జేసీ ఇంట్లో చెప్పినట్లుగా పనిచేయకపోతే భౌతికంగా హింసిస్తున్నారని, బూట్లు వేసుకు తన్నుతున్నారని బాధితురాలు రెహనా ఆరోపించింది. ఒక మహిళ పట్ల ఇంత అమానుషంగా వ్యవహరిస్తారా అని నిలదీసింది. జేసీ భార్య క్రూరంగా హింసిస్తున్నదని, సూపర్ వైజర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె తెలిపింది. తనకు న్యాయం చేయాలని, లేదంటే తాడేపల్లి సీఎం జగన్ రెడ్డి క్యాంప్ ముందు దీక్ష కు దిగుతానని రెహానా హెచ్చరించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.