FbTelugu

సీఐని బెదిరించిన జేసీ ప్రభాకర్ అరెస్టు

అనంతపురం: తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసు నమోదు అయ్యింది. నిబంధనలు ఉల్లంఘించడంతో పాటు దళిత సీఐ దేవేంద్రను దూషించడంతో తాడిపత్రి పోలీసులు మొత్తం 5 కేసులు నమోదు చేశారు.

జైలు నుంచి విడుదల అయిన తరువాత కడప నుంచి తాడిపత్రి దాకా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడంతో ప్రభాకర్ రెడ్డి పై 506, 189, 353 సెక్షన్ల కింద కేసు పెట్టారు. జేసీ పై డిజాస్టర్ మేనేజ్ మెంట్ 52 కింద కేసులు పెట్టి ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. జేసీ అరెస్ట్ సందర్భంగా తాడిపత్రి లో 144 సెక్షన్ విధించి, తాడిపత్రి లో భారీగా పోలీసు బలగాల మోహరించారు.

You might also like