FbTelugu

‘జైలుకైనా వెళ్తా.. అతని శరణు కోరను’: జేసీ

jc-divakar-reddy-fires-on-jagan

జైలుకైనా వెళ్త గానీ.. ఎవరి శరనూ కోరనని అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలోని ఆయన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో జేసీ మాట్లాడారు. తనను ఓ నాయకుడు వైసీపీలో చేరమని.. కేసులేవీ ఉండవని ఆఫర్ ఇచ్చినట్టు తెలిపాడు. దీంతో తాను తెదేపాలోనే ఉంటానని నిర్మొహమాటంగా చెప్పినట్టు తెలిపారు. అందుకే కక్ష కట్టి మా దివాకర్ ట్రావెల్స్‌ బస్సులను జప్తు చేస్తున్నారని ఆరోపించారు. బస్సులకు అన్ని అనుమతులు ఉన్నా.. బస్సులు విడుదల చేయాలని 25 రోజుల కిందటే ట్రైబ్యునల్‌ చెప్పినా వదలడం లేదని పేర్కొన్నారు.

You might also like