FbTelugu

నేడు జేసీ బ్రదర్స్ ఆమరణ దీక్ష !

* తమపై తప్పుడు కేసులు ఎత్తివేయాలంటూ డిమాండ్
* ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు
అనంతపురం: తమపై నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ నేటి నుంచి ఆమరణదీక్ష చేయనున్నట్టు టీడీపీ నేతలైన జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

దీంతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తాజా పరిణామాలతో పోలీసులు తాడిపత్రిలో 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ముందు జాగ్రత్త చర్యగా 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. ఎలాంటి ర్యాలీలు, ధర్నాలు చేపట్టాలన్నా ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాల్సిందేనని డీఎస్పీ చైతన్య స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.