FbTelugu

జయాబచ్చన్ వ్యాఖ్యలు తప్పు: జయప్రద

ఢిల్లీ: బాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఇప్పటికైనా గళం విప్పాల్సిన అవసరం ఉందని మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు జయప్రద అన్నారు.

పార్లమెంటులో బీజేపీ ఎంపీ రవికిషన్ చేసిన వ్యాఖ్యలను తను సమర్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. రవికిషన్ వ్యాఖ్యల విషయంలో ఎంపీ జయాబచ్చన్ అనవసరంగా రాజకీయాలు చేస్తోందని ఆమె విమర్శించారు. డ్రగ్స్ ఉచ్చు నుంచి యువను కాపాడాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. బాలీవుడ్ ను ఎవరూ కించపర్చడం లేదని, డ్రగ్స్ వినియోగంపైనే నిలదీస్తున్నామని జయప్రద అన్నారు.

You might also like