FbTelugu

8 నెలలు మంచు కిందే విగతజీవిగా జవాను

జమ్ము కశ్మీర్: 8నెలల కింద కనిపించకుండా పోయిన ఓ భారత జవానును రెండ్రోజుల క్రితం భారత బలగాలు మంచు కింద విగతజీవిగా గుర్తించాయి. ఈ దారుణ ఘటన కశ్మీర్ లోని గుల్మార్గ్ నియంత్రణ రేఖ వద్ద చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రాజేంద్ర సింగ్ నేగి అనే గుల్మార్గ్ లో నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వరిస్తున్నాడు.

ఈ క్రమంలో జనవరిలో కనిపించకుండా పోయాడు. ఎంతకీ ఆచూకి దొరకక పోవడంతో చనిపోయినట్టు నిర్ధారించుకొని అతని కుటుంబీకులకు కూడా సమాచారం ఇచ్చారు. రెండ్రోజుల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నియంత్రణ రేఖ వద్ద తనిఖీలు చేపట్టగా.. మంచుకింద రాజేంద్రసింగ్ మృత దేహాన్నిగుర్తించినట్టు తెలిపారు.

You might also like