FbTelugu

జవహర్ నగర్ డంపింగ్ యార్డు… డేంజర్ రోడ్డు

మేడ్చల్: జవహార్ నగర్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డు రోడ్ఢు పై ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇవాళ వేగంగా కారు, ఆటో బోల్తా ఢీకొట్టాయి. దుర్వాసన కారణంగా ద్విచక్ర వాహన దారులు పడిపోతున్నారు.

ఈ రోజు ఉదయం నుండి సుమారు 15 ప్రమాదాలు జారడంతో పలువురు గాయాలపాలయ్యారు. వారం రోజులుగా తరచూ డెంటల్ కాలేజీ నుండి సి.ఆర్.పి.యఫ్ వెల్లే దారిలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డ్ నుండి రసాయానాలు రోడ్ల పైకి రావడం, దానికి చలి మంచు తోడు కావడంతో ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వరుసగా ప్రమాదాలు జరుగుతున్నా, వాహనాలపై వెళ్లేవారు తీవ్ర గాయాల పాలవుతున్నా అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని ప్రజలు మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.