FbTelugu

జపాన్ లో వర్షాలకు 34 మంది మృతి

టోక్యో: జపాన్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మట్టి పెల్లలు, కొండ చరియలు విరిగిపడుతున్నాయి.

కుమామోటో, కగోషియో ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. కొండచరియలు విరిగిపడి సుమారు 34 మంది మరణించారు. ఇళ్లు నేలమట్టం కాగా, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. కుమమోటో ప్రాంతంలో తప్పిపోయిన 14 మంది కోసం రెస్క్యూ సిబ్బంది వెదుకుతున్నారు. ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాన మంత్రి షింజో అబె ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 40 వేల మంది పోలీసు, ఫైర్, కోస్టు గార్డు సిబ్బంది పనిచేస్తున్నారన్నారు. మరో 24 గంటలూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.