FbTelugu

ఆన్ లైన్ లో జన్వీ కపూర్ సినిమా

సినిమాలు సిద్దమయ్యాయి కాని ప్రదర్శించేందుకు హాళ్లు లేకపోవడం సమస్యగా పరిణమించింది. కరోనా కారణంగా మూతపడ్డాయి. ఒకప్పుడు వద్దనుకున్న విధానమే ఇప్పుడు సినీ పరిశ్రమకు ముద్దుగా మారింది.

దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటించిన చిత్రం గుంజన్ సక్సేనా… ది కార్గిల్ గర్ల్ విడుదలకు సిద్దంగా ఉంది. కొద్దిరోజులుగా సినిమా రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నా సినిమా హాళ్లు లేకపోవడం వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఇప్పట్లో సినిమా హాళ్లు తెరిచే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో ఆన్ లైన్ లో సినిమా రిలీజ్ చేయాలని గుంజన్ సక్సేనా సినిమా నిర్మాత నిర్ణయం తీసుకున్నారు. ఓటిటి విధానంతో దీన్ని దేశ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. నెట్ ఫ్లిక్స్ లో దీన్ని విడుదల చేస్తున్నారు. గులాబో సితాబో చిత్రాన్ని ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో జాన్వీతో పాటు అంగద్ బేడీ, మానవ్ విజ్, పంకజ్ త్రిపాఠి, నీనా గుప్తా, విజయ్ వర్మ, రజత్ బర్మేచా నటించారు. యుద్దానికి వెళ్లిన తొలి మహిళా వాయుసేన అధికారి గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ఈ మువీని నిర్మాణం చేశఆరు.

You might also like

Leave A Reply

Your email address will not be published.