FbTelugu

ఉద్యోగాల పేరుతో దోచుకున్న మంత్రి వెల్లంపల్లి

విజయవాడ: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో 150 పోస్టుల నియామకం పేరుతో రూ.3 కోట్లు మేయర్ తో కలిసి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ దోచుకున్నాడని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు.
దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీను, మేయర్ భాగ్యలక్ష్మి ఒక్కొక్కరి నుంచి రెండు లక్షలు వసూలు చేశారన్నారు. పేపర్ నోటిఫికేషన్ లేకుండా కార్పొరేషన్ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారని నిలదీశారు.

ఈ విషయంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు వచ్చినా మున్సిపల్ కమిషనర్ ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నారు. మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించి విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. మంత్రి వెల్లంపల్లి, మేయర్ కు సవాల్ విసురుతున్నాను, రూ.3 కోట్లు పుచ్చుకున్న ఆధారాలను త్వరలో బయట పెడతానన్నారు. మూడు నెలల్లో కియా కారు కొన్న మేయర్ కు లక్షల డబ్బులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దల అండతోనే వెల్లంపల్లి అవినీతి చేస్తున్నారనేది మాకు అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే.. న్యాయ స్థానం ద్వారా పోరాటం చేస్తానని మహేష్ తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.