FbTelugu

అరెస్టులు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్

విజయనగరం: రామతీర్థం క్షేత్రంలో శ్రీరాముని విగ్రహ ధ్వంసం ఘటనను ఖండిస్తూ జనసేన, బీజేపీ నేతలు ‘రామతీర్థ ధర్మయాత్ర’ కార్యక్రమాన్ని చేపట్టగా.. జనసేన నేతలు, శ్రేణులను గృహ నిర్బంధం చేసి, అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రోజు తెల్లవారుజాము నుంచి నేతలను, శ్రేణులను గృహ నిర్బంధంలో ఉంచడంతోపాటు కొన్ని చోట్ల పోలీస్ స్టేషన్లకు తీసుకువెళ్లి అరెస్టులు చేశారన్నారు. శాంతియుతంగా రామ తీర్థ ధర్మ యాత్రను చేపట్టిన విషయాన్ని పోలీసు శాఖ దృష్టిలో ఉంచుకోవాలన్నారు. రాష్ట్రంలో యధేచ్చగా హిందూ ఆలయాలపై దాడులు సాగుతుంటే ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటూ ఈ విధ్వంసాన్ని పక్కదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరిని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.