FbTelugu

నేడు జనసేన కీలక భేటీ!

గుంటూరు: జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రతినిధులతో ఆ పార్టీ అధ్యక్షుడు కొణిదెల పవన్ కళ్యాన్ నేడు సమావేశం కానున్నారు.

మూడు రాజధానులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పవన్ కళ్యాణ్ అత్యవసర భేటీ అవుతున్నారు. మూడు రాజధానుల వ్యవహారం ఆంద్రప్రదేశ్ లో హట్ టాపిక్ గా మారింది. రాజధాని రైతులకు జనసేన తరపున ఎలా అండగా ఉండాలన్న దానిపై నేటి సమావేశంలో చర్చ జరగనుంది.
సమావేశం అనంతరం మూడు రాజధానుల అంశానికి సంబంధించి భవిషత్తు కార్యా చరణపై జనసేన అధికారిక ప్రకటనచేసే అవకాశముందని అంటున్నారు. పవన్ పరిస్థితి కూడా ముందు నుయ్యి వెనక గొయ్యి మాదిరిలా ఉంది. బీజేపీ తో జతకట్టడంతో అమరావతి పై గట్టిగా మాట్లాడలేని పరిస్థితి ఉంది.

You might also like