FbTelugu

ఓ వైపు రామమందిరం నిర్మిస్తుంటే.. ఏపీలో కూల్చివేతలా: పవన్

విజయనగరం: ఓ వైపు యూపీలో రామ మందిరం నిర్మిస్తుంటే.. ఏపీలో మాత్రం రాముని విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.

తాజాగా జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం రామతీర్థం రామగిరిపై శ్రీరాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేయడం పట్ల ఆయన తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో రామతీర్థం ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.