FbTelugu

లెక్చరర్ గా పవన్ కళ్యాణ్

వకీల్ సాబ్ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చిన హీరో, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో వీరమల్లు, కె.సాగర్ చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ చిత్రాల్లో బిజీగా ఉన్నారు.
సెకండ్ వేవ్ కరోనా కారణంగా ఈ రెండు చిత్రాల షూటింగ్ వాయిదా పడింది.

దర్శకులు హరీశ్ శంకర్ పవన్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ను జూన్ నెలలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కళా దర్శకుడు ఆనంద్ సాయి కాలేజీ సెట్ నిర్మించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ చిత్రంలో వపన్ కాలేజీ లెక్చరర్ గా కనువిందు చేయనున్నారు. కాలేజీ, స్టూడెంట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా అధిక భాగం సెట్ లో జరగనున్నది. అయితే పవన్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఖరారు చేయలేదు.

You might also like

Leave A Reply

Your email address will not be published.