FbTelugu

పార్లమెంటులో వైసీపీ నిలదీయాలి: పవన్ సవాల్

అమరావతి: విశాఖ స్టీలు ప్లాంట్ పై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వైసీపీ కి చెందిన 22 మంది ఎంపీలు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ డిమాండ్ డిమాండ్ చేశారు.

విశాఖ మున్సిపల్ ఎన్నికల కోసమే ర్యాలీల పేరుతో వైసీపీ స్టంట్లు చేస్తున్నదని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో విశాఖ స్టీలుపై గళమెత్తేందుకు వైసీపీ ఎంపీలు భయపడుతున్నారన్నారు. తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన కోరారు. 22 మంది ఎంపీలను గెలిపిస్తే, రాష్ట్రంలో కేవలం నిరసనలతో ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రుల హక్కు అయిన ప్లాంట్ ను ప్రత్యేక దృష్టితో చూడాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ను కోరడం జరగిందన్నారు. స్టీలు ప్లాంట్ పరిరక్షించుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, ఉద్యోగులు, కార్మికులకు తాను అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.