FbTelugu

నాగబాబు వ్యాఖ్యలతో సంబంధం లేదు

స్పష్టం చేసిన పవన్ కల్యాణ్

అమరావతి: వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించే నాయకులతో జనసేన పార్టీకీ ఎలాంటి సంబంధంలేదని ఆ పార్టీ అధినేత కొణిదెల పవన్ కల్యాణ్ అన్నారు.

సోషల్ మీడియాలో వస్తున్న కొణిదెల నాగబాబు అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైన వ్యాఖ్యలని అన్నారు. ఆ వ్యాఖ్యలతో జనసేన పార్టీకీ సంబంధం లేదని స్పష్టం చేశారు. జనసేన కార్యకర్తలు ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని కోరుతున్నట్టు తెలిపారు. క్రమశిక్షణను అతిక్రమించకుండా కార్యకర్తలు ముందుకు వెళ్లాలని సూచించారు.

పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు మొన్న మహాత్మా గాంధీని చంపిన నాథురామ్ గాడ్స్, తాజాగా కరెన్సీ నోట్లపై గాంధీ బొమ్మపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై నాగబాబు స్పందించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

You might also like