FbTelugu

కాంగ్రెస్ లో సొంత భజన మంచిది కాదు: జానారెడ్డి

హైదరాబాద్: సోషల్ మీడియాలో కొందరు.. కాంగ్రెస్ నాయకుల పట్ల రకరకాల వార్తలు వ్యాప్తి చేస్తున్నారని, ఇలాంటి వార్తల వల్ల ఉపయోగం లేదని మాజీ సీఎల్పీ నాయకుడు కె.జానారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో మా నాయకుడు గొప్ప అంటూ పరస్పర సవాళ్లు సరైనవి కావు, పరుష పదాలతో అవమాన పరిస్తే మొత్తం పార్టీ కి నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ఇవాళ గాంధీ భవన్ లో జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. అభిమానంతో అవగాహన లేకుండా ఇతరులను విమర్శిస్తే.. పార్టీ కి మంచిది కాదని హెచ్చరించారు. అభిమానించే నాయకులకు కూడా మంచిది కాదని, అలాంటి పోస్టుల వల్ల నాయకులకు నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. అభిమానులను వారి నాయకులు కూడా సరి చేయాలి, లేదంటే అందరికీ ఇబ్బందులు తలెత్తుతాయని జానారెడ్డి హెచ్చరించారు.
అలాంటి వారిపై పార్టీ సీరియస్ గా ఉండాలి. వారిపై పీసీసీ చర్యలు తీసుకోవాలి. లేదంటే హైకమాండ్ దృష్టి కి తీసుకెళ్తానన్నారు. ఈ విధానాన్ని పెద్ద నుంచి చిన్న వరకు అందరికీ వర్తింపచేయాలన్నారు. పీసీసీ నాయకత్వం.. అంతా సమావేశమై.. అభిమానులను అదుపులో ఉంచేలా చూడాలని కోరారు. అవగాహన లేకుండా పోస్టులు పెడితే.. అలాంటి అభిమానులపై చర్యలు తీసుకోవడంతో పాటు హెచ్చరికలు జారీ చేయాలి. అందరూ నాయకులు ఐక్యమతంగా రేపటి నుంచి వ్యవహరించాలని కోరారు. నాయకులను తిడుతూ పెట్టే పోస్టులు ఎవరు పెడుతున్నారనేది అందరికీ తెలుస్తుందన్నారు. సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు కు ఒక నాయకుడి వీరాభిమాని ఫోన్ చేసి వాడిన భాష సరైంది కాదని నా దృష్టికి వచ్చిందన్నారు. ఇలాంటి సాంప్రదాయం కాంగ్రెస్ పార్టీ విధానం కాదన్నారు. ఒకర్ని బద్నాం చేయారని కూడా కొందరు చేయవచ్చు.. దానికి పరస్పరం కలిసి పోరాటం చేయాలని జానారెడ్డి అన్నారు.

తెలంగాణ లో వివిధ హోదాలలో 4.90 లక్షల ఉద్యోగాల కల్పన సృష్టించింది కాంగ్రెస్ కాదా అని టీఆర్ఎస్ ను సూటిగా ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ తన ఏడేళ్ల పాలనలో ఉన్న ఖాళీలను భర్తీ ఎందుకు చేయడం లేదని నిలదీశారు. ఉద్యోగ నియామకం పక్కన పెట్టి.. వారు ఇచ్చిన నిరుద్యోగ హామీని ఎందుకు నిలబెట్టుకోలేదో సమాధానం చెప్పాలన్నారు. రెండేళ్లు పూర్తయినా నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదన్నారు. వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పై నిందలు వేస్తున్నారన్నారు. నేను నా నియోజకవర్గంలో 30 ఏళ్ల కింద అమ్మిన ఇళ్లు.. అక్కడ వచ్చేవి భగీరథ నీళ్లు కావని, సాధారణంగా వచ్చేవేనన్నారు. నేను 20 నుంచి 30 ఊర్ల పేర్లు ఇస్తా.. మీడియా కు రవాణా సౌకర్యం కల్పిస్తా.. భగీరథ నీళ్లు వస్తున్నాయో చూపించండని జనారాడ్డి సవాల్ చేశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణీదేవికీ టీ.ఆర్.ఎస్ టిక్కెట్ ఇవ్వడం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమన్నారు. పీవీ నరసింహారావు దేశానికి ప్రధానమంత్రి చేసింది కాంగ్రెస్.. అంతకంటే గౌరవం ఇంకేమిస్తుందన్నారు. ప్రజలకు మా ద్వారా నే మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తే.. అప్పుడు సేవ అందించడానికి మేం సిద్ధంగా ఉంటామన్నారు. నేతలు మా పార్టీని వీడటానికి కారణం కాంగ్రెస్ లో లోపం కాదు.. సమాజంలో ఉందన్నారు. కాంగ్రెస్ ఎంత పోరాటం చేసినా.. చూసే విధానం లో ఉందన్నారు. పోరాటం ఏం చేయాలి.. ఎంత వరకు చేయాలి.. ప్రభుత్వం చేసే తప్పులను చాలా వరకు హెచ్చరించాం.. వింటే కదా అని ప్రశ్నించారు. మేం పదేపదే హెచ్చరిస్తే.. అధికారం పోగానే కాంగ్రెస్ నేతలు ఆగడం లేదని మళ్లీ విమర్శలు చేస్తారు. ప్రజలు మాకు గుణపాఠం చెప్పినట్లు గా .. వాళ్లకు చెబుతారు. వచ్చే ఎన్నికల నాటికి తిరగబడతారని జానారెడ్డి జోస్యం చెప్పారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.