హైదరాబాద్: తెలంగాణలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నిల్లో ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడంతో.. టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పీసీసీ పదవికోసం నేనంటే నేనంటూ.. పోటీపడుతున్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి స్పందించారు. పీసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తిలేదన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీ ఎవర్ని నియమించినా తనకు అభ్యంతరం లేదన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా, తాము అందరం కృషి చేస్తామన్నారు. అలాగే నూతన పీసీసీ చీఫ్ కు సహకరిస్తానని, అందరం కలసికట్టుగా పనిచేస్తామని తెలిపారు.