FbTelugu

గుండాకు పోలీసుల సపోర్టు: జగ్గారెడ్డి

సంగారెడ్డి: నాపై ఒక వీడియో సోషల్ మీడియా లో చెక్కర్లు కొడుతున్నది, ఆ వీడియో చూసి సంగారెడ్డి లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆవేశపడొద్దని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి కోరారు.
ఈ వీడియో రిలీజు చేసిన హమీద్ అనే వ్యక్తి పై ఇప్పటికే పోలీసులకు కంప్లైంట్ చేశానని, కానీ పోలీసులు పూర్తి స్థాయిలో దీని పై దృష్టి పెట్టిన్నట్లు కన్పించడం లేదన్నారు. అయినా హమీద్ ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేసి నేను జగ్గారెడ్డి కే భయపడటం లేదు అనే విధంగా సవాల్ చేశాడు. కొందరు పోలీసులు హమీద్ కి సహకరిస్తేన్నారనే సమాచారం ఉంది. ఇప్పటికే హమీద్ వల్ల సంగారెడ్డి లో సుమారు 30 కుటుంబాలు అతని దగ్గర వడ్డీ కి డబ్బులు తీసుకొని చక్రవడ్డీలు కట్టి చిత్రహింసకు గురై సంగారెడ్డి వదిలి వెళ్లిపోయారని ఎమ్మెల్యే తెలిపారు.

అవుసలి శ్రీనివాస్ కి హమీద్ అనే వ్యక్తి వడ్డీ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. దీనికి శ్రీనివాస్ వడ్డీ రూపంలో చాలా డబ్బులు చెల్లించాడు. ఐనా హమీద్ ఆ కుటుంబాన్ని చిత్రహింసలు పెడుతుంటే శ్రీనివాస్ కుటుంబం నా దగ్గరికి వస్తే ఇబ్బంది పెట్టోదు అన్నాను. హమీద్ అప్పటినుండి ఇప్పటివరకు అనగా మూడేళ్ల నుంచి ఎదురు పడలేదన్నారు. నేరుగా 10 రోజుకు కిందట వచ్చి నేనే ఎదో డబ్బులు ఇవ్వాలన్నట్లు గా హమీద్ ప్రవర్తించాడు. టౌన్ పోలీసులు, రూరల్ పోలీసులు, డిఎస్పి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోలీసుల దర్యాప్తు చేయలేదన్నారు. సంగారెడ్డి లో గంజాయి, డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. గంజాయి, డ్రగ్స్ తో యువకులు చెడిపోవడమే కాకుండా గుండాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జగ్గారెడ్డి అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.