FbTelugu

కేసీఆర్ జోకర్ కావడం ఖాయం: జగ్గారెడ్డి

హైదరాబాద్: సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెడితే జోకర్ అవుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. ప్రాంతీయ పార్టీని నడిపినంత ఈజీ జాతీయ పార్టీ నడపడం కాదని ఆయన ఎద్దేవా చేశారు.

గత ఆరు సంవత్సరాలుగా ఇంటి గడప దాటకుండా గడీల పాలన చేస్తున్న కేసీఆర్, నాలుగు గోడల మధ్య కూర్చుంటే జాతీయ పార్టీ నడవదని అన్నారు. ప్రధాని పీఠంపై కన్నేసిన శరద్ పవార్, మాయావతికే సాధ్యం కాలేదని, దళిత వ్యతిరేకి కేసీఆర్ కు మాయావతి మద్దతు దక్కడం అసాధ్యమన్నారు. శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ, ఎన్సీపీ ల సిద్ధాంతాలు వేరని అన్నారు. ప్రజాస్వామ్యం దేశంలో ఇలాంటి నాయకులను ప్రజలు అంగీరించనే వాస్తవాన్ని కేసీఆర్ గ్రహిస్తే మంచిదని జగ్గారెడ్డి హితవు పలికారు.

You might also like