FbTelugu

ప్రతినాయకునిగా డిఫరెంట్ లుక్ తో జగపతిబాబు

విభిన్న పాత్రల్లో తనదైన ముద్ర వేసుకున్న జగపతిబాబు క్యారెక్టర్ ఏదైనా ఇట్టే ఇమిడి పోతాడు. అయితే తాజాగా జగపతి బాబు ప్రతినాయకునిగా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నట్టు సమాచారం. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో ఏకంగా ప్రభాస్ కు ప్రతినాయకునిగా నటించనున్నాడు. ప్రభాస్ కథానాయకునిగా, పూజా హెగ్డే కథానాయికగా తెరకెక్కనున్న ఈ మూవీ ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర ఓ రేంజ్ లో ఉంటుందని విశ్వసనీయ సమాచారం.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More