FbTelugu

రాష్ట్రపతి దంపతులకు జగన్ ఆహ్వానం

తిరుపతి: రాష్ట్రపతి శ్రీ రాంనాథ్ కొవింద్ దంపతులకు రేణిగుంట విమానాశ్రయం లో సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు స్వాగతం పలికారు.

తిరుమల తిరుపతి దర్శనార్థం తిరుపతి కి విచ్చేసిన రాష్ట్రపతికి రేణిగుంట విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రులు, బీజేపీ నాయకులను సీఎం పరిచయం చేశారు. ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, జాతీయ కార్యదర్శి వై. సత్యకుమార్, ఎంపీ జివీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.

తిరుచానూరులో దర్శనం…

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కూడా ఉన్నారు. రాంనాథ్ కొవింద్ దంపతులకు టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి తీర్థ ప్రసాదాలు అందచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.