పశ్చిమగోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లాక్ డౌన్ లో ముఖ్యమంత్రి జగనన్న కానుక విద్యుత్ షాక్ అని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..
జగన్ పాదయాత్ర సమయంలో తాను ముఖ్యమంత్రి అయితే విద్యుత్ చార్జీలు పెంచనని చెప్పి ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచినట్టు తెలిపారు.