FbTelugu

జగన్ బెయిల్ కేసు జూలై 1కు వాయిదా

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటీషన్ విచారణ జూలై 1వ తేదీకి వాయిదా పడింది. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలైన పిటీషన్ పై ఇవాళ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరిగింది.
రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు పిటీషన్ వేశారని జగన్ ఈ నెల 1వ తేదీన కౌంటర్ దాఖలు చేశారు.

రఘురామ తనపై ఉన్న కేసులను పిటీషన్ లో ప్రస్తావించలేదన్నారు. జగన్ దాఖలు చేసిన కౌంటర్ పై ఎంపి సమాధానమిచ్చారు. రఘురామ రీజాయిండర్ పై వాదనలు విన్పించేందుకు జగన్ తరఫు న్యాయవాదులు సమయం కోరగా విచారణను జూలై 1వ తేదీకి వాయిదా వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.