FbTelugu

జగనన్న విద్యా కానుకకు పాలనా అనుమతి

అమరావతి: జగనన్న విద్యా కానుక పథకానికి ఏపీ ప్రభుత్వం పాలనా అనుమతులు మంజూరు చేసింది.

వచ్చే విద్యా సంవత్సరం (2021-22) నుంచి జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులకు కిట్ల పంపిణీ చేయనున్నారు. 2021-22 విద్యా సంవత్సరంలో రూ.730 కోట్ల వ్యయంతో విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఈసారి విద్యార్ధులకు ఇచ్చే కిట్లలో ఒక డిక్షనరీ కూడా అందచేస్తారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.