FbTelugu

శారదా పీఠంలో జగన్ యాగం

విశాఖపట్నం: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి స్వాగతం పలికారు.

పెందుర్తి మండల చిన మూషివాడలో శ్రీ శారదా పీఠంలో వార్షికోత్సవాలు ఇవాళే ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల తొలి రోజు కార్యక్రమానికి సీఎం జగన్ హాజరయ్యారు. ఉదయం 7.30 గంటలకు స్వరూపానందేంద్ర సరస్వతి ఉత్సవాలకు అంకురార్పరణ చేసి, దేవతా మూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు.
సీఎం జగన్ రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, తాండవమూర్తి, దాసాంజనేయ స్వామి ఆలయలను దర్శించుకుని రాజశ్యామల యాగంలో పాల్గొన్నారు. పూజలు ముగిసిన తరువాత శారదాపీఠం వెబ్ ఫోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అవంతి శ్రీనివాస్, వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

 

 

You might also like

Leave A Reply

Your email address will not be published.