FbTelugu

చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబానికి జగన్ పరామర్శ

ఇటీవల కరోనాతో హైదరాబాదులోని అపోలో అసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యువాత పడిన ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను ఇవాళ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి ఓర్వకల్లు వెళ్లిన సీఎం అక్కడ్నించి హెలికాప్టర్ లో అవుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించారు.

అనంతరం రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రామకృష్ణారెడ్డి తనయుడు భగీరథ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. జగన్ వెంట ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఇతర ప్రముఖులు ఉన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.