FbTelugu

వ్యాక్సిన్ వేసుకున్న జగన్

గుంటూరు: ఎపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. భారత్ పేటలోని 140వ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకుని, అక్కడే వ్యాక్సిన్ వేసుకున్నారు.

ఆ తరువాత వైద్యుల పర్యవేక్షణలో కొద్ది సమయం కూర్చుకున్నారు. అంతకు ముందు జగన్ బ్లడ్ ప్రెషర్ ను పరిశీలించారు. 45 సంవత్సరాలు దాటిన వారికి ఏప్రిల్ 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ ఇస్తున్నందున జగన్ ఇవాళ తీసుకున్నారు. వార్డు సచివాలయానికి జగన్ తన భార్య భారతి రెడ్డితో కలిసి వచ్చారు. తరువాత జగన్ వార్డు, గ్రామ సచివాలయాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

bharathipeta ward office

You might also like

Leave A Reply

Your email address will not be published.