FbTelugu

మృతదేహాన్ని జేసీబీతో తరలించడంపై జగన్ ఆగ్రహం

అమరావతి: పలాస్ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేశారు. కరోనాతో మృతిచెందిన ఓ వ్యక్తి మృతదేహాన్ని జేసీబీపై తరలించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు.

మానవత్వం చూపకుండా కొందరు వ్యవహరించిన తీరు బాధించిందని అన్నారు. ఈ చర్యలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.

You might also like