FbTelugu

ఒక్క ఛాన్స్ అని జగన్ మాట తప్పారు: బాబు

21న విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన

హైదరాబాద్: విద్యుత్ ఛార్జీల పెంపుపై రాష్ట్ర వ్యాప్త నిరసనలకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎన్నికల ముందు ఓట్ల కోసం విద్యుత్ ఛార్జీలు పెంచమని వైఎస్. జగన్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ పదవి చేపట్టాక మాట తప్పి ఛార్జీలు పెంచడం దారుణమని చంద్రబాబు నాయుడు విమర్శించారు.

ఈ నెల 21న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలు, నియోజకవర్గాల్లో నిరసనలు చేపట్టాలని శ్రేణులను కోరారు. ఇళ్లలోనే ఉంటూ టీడీపీ నాయకులు దీక్షలు చేయాలని ఆదేశించారు. 3, 4 రెట్లు విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తున్నామన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రజానీకం ఉంటే కరెంటు బిల్లులు పెంచడం హేయమని చంద్రబాబు అన్నారు.

దేశంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) కేంద్రం రూ.90 వేల కోట్లు రాయితీలు ఇచ్చిందని అన్నారు. అయినా జగన్ ప్రభుత్వం మాత్రం విద్యుత్ ధరలు పెంచడం దుర్మార్గం అని ఖండించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు ఏనాడు పెంచలేదన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని కూడా ప్రకటించామని ఆయన గుర్తు చేశారు.

 

You might also like