FbTelugu

అబ్దుల్ కలాం పేరు మార్పుపై జగన్ సీరియస్

Jagan-Serious-on-Abdul-Kalams-name-change

అమరావతి: మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో కొనసాగుతున్న ప్రతిభా పురస్కారాలకు పేరు మార్పుపై సీఎం వైఎస్.జగన్ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రపతి పేరుతో ఉన్న పథకానికి పేరు మార్చే విషయంలో తన దృష్టికి తీసుకురాకుండా ఎలా అమలు చేస్తారని అధికారులను మందలించారు. ప్రతిభా పురస్కారాల పేరు మారుస్తూ ఇచ్చిన జీఓ ను వెంటనే రద్దుచేయాలని ఆదేశించారు. గతంలో మాదిరే అబ్దుల్‌ కలాం పేరు పెట్టాలని సూచించారు. మిగతా పథకాలకు దేశంలో మహనీయుల పేర్లు పెట్టాలన్నారు. మహాత్మాగాంధీ, భారత రత్న బీఆర్. అంబేడ్కర్, మహాత్మా పూలే, జగ్జీవన్‌రాం వంటి మహనీయుల పేర్లతో అవార్డులు ఇవ్వాలని ఆదేశాలిచ్చారు.

You might also like