FbTelugu

పోలవరం పనులకు ఆటంకం రాకూడ‌దు: జ‌గన్‌ 

అమ‌రావ‌తి: వ‌ర్షాకాలంలోనూ పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు అంత‌రాయం లేకుండా ప్ర‌ణాళిక‌బ‌ద్దంగా ప‌నిచేయాల‌ని ఏపీ సీఎం వైఎస్.జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.

గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ ఏడాది ప్రారంభించనున్న 6 ప్రధాన ప్రాజెక్టులపై సీఎం జ‌గ‌న్ సమీక్ష నిర్వ‌హించారు. అక్టోబరులో అవుకు టన్నెల్‌–2, వెలిగొండ మొదటి టన్నెల్, నెల్లూరు, సంగం బ్యారేజీల ద్వారా సాగునీరు అందించాలని సీఎం జగన్ అన్నారు. వంశధార నాగావళి లింక్‌ ద్వారా డిసెంబరులో నీటి విడుదల. నవంబరులో పోలవరం గేట్ల బిగింపునకు ప్రయత్నాలు చేయాలన్నారు. వర్షా కాలంలోనూ ప్రణాళికా బద్ధంగా అంతరాయం లేకుండా పోలవరం పనులు కొనసాగాలన్నారు.

గత ఏడాది గోదావరి వరదలను దృష్టిలో ఉంచుకుని ముమ్మరంగా పునరావాస పనులకు ఆదేశించారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్‌–2, వెలిగొండ ప్రాజెక్టులో హెడ్‌ రెగ్యులేటర్‌ వర్క్స్, టన్నెల్‌–1 పనులు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టులో ఫేజ్‌ –2లో స్టేజ్‌–2 పనులపై సమీక్షించారు. అవుకు టన్నెల్‌ –2 పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అక్టోబరులో ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు వెల్ల‌డించారు.

వెలిగొండ టన్నెల్‌–1లో ఇంకా తవ్వాల్సింది 700 మీటర్లు ఉందన్న అధికారులు. నిర్దేశిత సమయంలోగా పూర్తి చేస్తామన్న అధికారులు. వచ్చే అక్టోబరు నాటికి టన్నెల్‌–1 ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు. నల్లమలసాగర్‌ నుంచి ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌కు వెళ్లే 180 మీటర్ల టన్నెల్‌ పనులు కూడా మరో 3 నెలల్లో పూర్తవుతాయని, తీగలేరు కెనాల్‌కు వెళ్లే 600 మీటర్ల టన్నెల్‌ పనులు కూడా పూర్తవుతున్నాయని అధికారులు సీఎం జ‌గ‌న్‌కు ‌వివరించారు.

నెల్లూరు బ్యారేజీ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని, అక్టోబరు చివరి నాటికి పనులు పూర్తి అవుతాయని వెల్లడించారు.  సంగం బ్యారేజీ పనులు కూడా అక్టోబరు చివరి నాటికి పూర్తవుతాయన్న అధికారులు. వంశధార– నాగావళి లింక్‌ పనులు ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తామన్నారు.

పోలవరం ప్రాజెక్టులో పనుల పురోగతిని వివరించారు. ఆగస్టు తప్ప మిగిలిన సమయాల్లో స్పిల్‌వే పనులు నడిచేలా ప్రణాళిక వేసుకున్నామన్నారు. ఏప్రిల్‌లో 3 వేల మంది కూలీలు ఉంటే.. కోవిడ్‌ కారణంగా 900 మంది మాత్రమే పనుల్లో ఉన్నారని, మళ్లీ వారందర్నీ పిలిపిస్తున్నామని వివరించారు. న‌వంబరులో ఎట్టి పరిస్థితుల్లోనూ గేట్లను అమర్చేలా చర్యలు తీసుకోవాలని, పనులు ప్రణాళికా బద్ధంగా సాగకపోతే.. షెడ్యూల్‌కు అంతరాయం ఏర్పడుతుందని సీఎం అన్నారు. చిత్రావతి, గండికోట ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయి నీటిని నిల్వ చేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని జగన్ అధికారులను ఆదేశించారు.

You might also like