FbTelugu

కర్నూలు ఎయిర్ పోర్టుపై బాబు డ్రామా: జగన్

కర్నూలు: ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కర్నూలు విమానాశ్రయం డ్రామా ఆడారని సీఎం వైఎస్.జగన్ రెడ్డి ఆరోపించారు. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారన్నారు.

ఇవాళ కర్నూలు నగర శివారు ఓర్వకల్ లో రూ.110 కోట్లతో 1008 ఎకరాల్లో నిర్మించిన నూతన విమానాశ్రయాన్ని సీఎం వైఎస్.జగన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును విమానాశ్రయానికి పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు. కర్నూలు వాసులు ఇప్పటి వరకు రైలు, రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించారన్నారు. ఇక నుంచి విమానయానం చేయవచ్చని, 28వ తేదీ నుంచి విమాన రాకపోకలు ప్రారంభమవుతాయన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశామన్నారు.
ఇక్కడి నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమనాలు రాకపోకలు సాగిస్తాయన్నారు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్ చేసుకునే విధంగా రన్ వే ను అభివృద్ధి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.