FbTelugu

వకీల్ సాబ్ కు జగన్ సర్కార్ అడ్డంకులు!

విజయవాడ: ఏపిలో ఇంకా కొన్ని గంటలు దాటితే జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం విడుదల అవుతున్నది. ఆయన అభిమానులు వేయి కళ్లతో చూసేందుకు ఎదురు చూస్తున్నారు.
పెద్ద సినిమాలు విడుదల అయిన సందర్భంలో అదనపు షో లు, ప్రీమియర్ షోలు వేసుకునేందుకు అనుమతులు ఇచ్చే సంప్రదాయం ఉంది. గతంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్యేక జిఒలు జారీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు టికెట్ల రేట్లు కూడా పెంచుకునేందుకు ఓకే చెప్పేవి. కాని వకీల్ సాబ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తున్నదంటూ పవన్ అభిమానులు భగ్గుమంటున్నారు.

సినిమా విడుదల సందర్భంగా ప్రీమియర్ షోలు, బెన్ ఫిట్ షోలు, రెగ్యులర్ షోల కు సినిమా హాలు యజమానులు ధరలు పెంచేసి టికెట్లు కూడా విక్రయించారు.
అయితే పెంచి అమ్మితే సినిమా హాలును సీజ్ చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవి కూడా ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రీమియర్, బెన్ ఫిట్ షోలు ప్రదర్శించడానికి వీలు లేదని, టికెట్ల ధర పెంచడానికి అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ ప్రకటనతో పవన్ అభిమానులు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే శుక్రవారం థియేటర్ల ముందు కూర్చుని ఆందోళన చేస్తామని అభిమానులు హెచ్చరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.