FbTelugu

టెన్త్, ఇంటర్ పరీక్షలు తథ్యం: జగన్

అమరావతి: టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుంటే విద్యార్థుల భవిష్యత్‍కే నష్టం అని సీఎం వైఎస్. జగన్ రెడ్డి అన్నారు. విద్యార్థుల భవిష్యత్ గురించి నా కంటే ఎవరూ ఎక్కువ ఆలోచించరు అన్నారు.

పరీక్షలు నిర్వహించకుండా సర్టిఫికెట్లలో కేవలం పాస్ అని ఇస్తే.. భవిష్యత్‍లో విద్యార్థులు నష్టపోతారు. పరీక్షలు నిర్వహించాలో వద్దో కేంద్రం రాష్ట్రాలకే వదిలేసిందని జగన్ చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు. ప్రతి విద్యార్ధి భవిష్యత్ కోసం నేను ఆలోచిస్తాను. విపత్కర పరిస్థితుల్లో కూడా కొంత మంది విమర్శలు చేస్తున్నారు. అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధమైన పాలసీ లేదు. పరీక్షల విషయాన్ని కేంద్రం రాష్ట్రాలకే వదిలేసింది. కొన్ని రాష్ట్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. టెన్త్, ఇంటర్ సర్టిఫికెట్లపైనే విద్యార్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మార్కులను బట్టే ఏ విద్యార్థికైనా కాలేజీలో సీటు వస్తుంది అనిజగన్ చెప్పారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం అని సీఎం వైఎస్.జగన్ భరోసా ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.