FbTelugu

రుయా ఘటన మన చేతుల్లో లేదు: జగన్

తాడేపల్లి: ప్రతి ఒక్కరు కరోనా వైరస్ తో కలిసి జీవించాల్సిన పరిస్థితుల్లో ఉన్నారని, ఈ క్రమంలో బాధాకర ఘటనలు జరుగుతున్నాయని ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి విచారణ వ్యక్తం చేశారు. మన చేతుల్లో లేని అంశాలకూ బాధ్యత వహించాల్సి వస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని జగన్మోహన్‌రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సిఎం సమీక్ష నిర్వహించారు. రుయా హాస్పిటల్ కు తమిళనాడు నుంచి ఆక్సిజన్‌ ట్యాంకర్‌ సమయానికి రాలేదన్నారు. దీంతో ఆక్సిజన్‌ కొరత ఏర్పడిందని, ఫలితంగా 11 మంది మరణించారని అధికారులు తనకు చెప్పారన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత రాకుండా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండి.. సమస్యలను పరిష్కరించాలని జగన్‌ సూచించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్‌పై జగన్ సుధీర్గంగా చర్చించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.