FbTelugu

ప్రతి ఏటా వాలంటీర్లను సత్కరిస్తాం: జగన్

విజయవాడ: వాలంటీర్ల సేవలను ప్రశంసిస్తూ, ఇక నుంచి రాష్ట్రంలో ప్రతి ఏటా వాలంటీర్లకు సత్కారం కార్యక్రమం ఉంటుందని సిఎ వైఎస్.జగన్ రెడ్డి చెప్పారు. వాలంటీర్ల వ్యవస్థతో రాష్ట్రంలో పరిపాలన అంటే ఏంటో చూపించగలిగామని అన్నారు.
ఉగాది పర్వదినం సందర్భంగా వలంటీర్లకు పురస్కార ప్రదాన కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పెనమలూరు మండలంలో సిఎం జగన్ రెడ్డి ప్రారంభించారు.

లాంఛనంగా 9 మంది వలంటీర్లను సత్కరించి, సేవా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యుత్తమ సేవలందించిన గ్రామ, వార్డు వాలంటీర్లను ప్రభుత్వం సత్కరించిందన్నారు. కులాలు, మతాలు చూడకుండా నిస్వార్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. విమర్శలకు బెదరకుండా పనిచేయాలని స్పష్టం చేశారు. మీకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుందని సిఎం హామీ ఇచ్చారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.