FbTelugu

విగ్రహాలను ధ్వంసంచేస్తే కఠిన చర్యలు తప్పవు: జగన్

* దేవుడితో చెలగాటమాడొద్దు
* అర్హులందరికీ ఇళ్లపట్టాలు అందాలి
అమరావతి: రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసంచేస్తే కఠిన చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. అర్హత ఉండి ఇళ్ల పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని అన్నారు.

అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందాలన్నారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడన్నారు. విగ్రహాల విధ్వంసంలాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం తమది కాదని అన్నారు. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యంకార్డులు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇచ్చేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.