అమరావతి: త్వరలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకానున్నాయి. సీఎం వైఎస్.జగన్ రెడ్డి నోటి వెంట కొత్త జిల్లాల ఏర్పాటు మాట వచ్చింది.
ఇవాళ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లా చేసే ఆలోచన ఉందన్నారు. ఇప్పటికే జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు అదనంగా కొత్తగా 12 జిల్లాలు ఏర్పడే అవకాశం ఉంది.