FbTelugu

వారం రోజుల్లోగా ఇసుకను స్టాక్ చేయాలి: జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే వారం పది రోజుల్లోగా కావాల్సిన ఇసుకను స్టాక్ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 20 శాతం మంది జనాభాకి ఇళ్ల పట్టాలు ఇస్తున్నట్టు తెలిపారు. కారోనా కారణంగా రాష్ట్రంలో న్యాయపరమైన కేసులు పరిష్కారం కాలేదని అన్నారు. సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఈ ఆగస్టు 15 న పేదలకు ఇళ్లపట్టాలను పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.

You might also like