FbTelugu

అర్హులందరికీ ఇళ్లపట్టా రావాలి: జగన్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అర్హులందరికీ ఇళ్లపట్టాలు రావాలని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. పేదలకు ఇళ్లపట్టాల పంపిణీపై ఇవాళ ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ఇళ్లపట్టాల పరిస్థితిని సమీక్షించారు. భూసేకరణ, పొజీషన్, ప్లాట్ల అభివృద్ధిపై అధికారులు పర్యవేక్షించాలని అన్నారు.

జులై 08న ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 29 నుంచి 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నట్టు తెలిపారు. నూటికి నూరు శాతం ఇళ్లపట్టాలు పంపిణీ అవుతాయని అన్నారు. ప్లాట్ల కేటాయింపుకోసం లాటరీ ప్రక్రియ ప్రారంభించాలని అన్నారు. లబ్దిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలని ఆదేశించారు. సరైన కారణం లేకుండా ఎవరికైనా పట్టా రాలేదంటే అధికారులదే బాధ్యత అంటూ హెచ్చరించారు.

You might also like